టమోటాలను ఇలా చేసి తింటే..ఎన్ని లాభాలో..!!

-

టమోటాలు వంటల్లో విరివిగా వాడే కూరగాయ.. ఎవరి వంటింట్లో అయినా ఎప్పుడూ టమోటాలు స్టాక్‌ ఉంటాయి.. టామోటాలు లేకుండా ఒక వారం రోజులు కూరలు వండగలుగుతారా..? ఇలా సవాల్‌ విసిరితే చేయొచ్చు కానీ.. మాములుగా అయితే మనం ఎక్కువగా వాడే కూరగాయల్లో ఒకటి టమోటా.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కూరగాయలు మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందించి.. మనకు పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చుతాయి. కేవలం టమాటాల ద్వారానే కాకుండా ఎండిపోయినటువంటి టమోటాల ద్వారా కూడా పలు రకాల ప్రయోజనాలున్నాయి. ఎండిపోయిన అయిన మనం ఎండపెట్టిన టమాటాలు అని అర్థం.. నిజానికి వీటిల్లోనే చాలా ఎక్కవ పోషకాలు ఉన్నాయట..!!
బీపీ కారణంగా గుండె సమస్యలు, కిడ్నీ సంబంధిత వ్యాధులను డ్రై టమాటాలు తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతాయి. టమాటాలలో పొటాషియం అధికంగా ఉండడం వల్ల అధిక రక్తపోటును ఇవి తగ్గిస్తాయి.. ఎండిన టమాటాలలో విటమిన్ సి, కే, నియాసిన్, కాపర్, ప్రోటీన్, మాంగనీస్, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.డ్రై టమాలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో ఉండే కాల్షియం ఎముకలు దృఢంగా ఉండేందుకు సహాయపడుతుంది. గుండె కండరాలను కూడా బలపరుస్తాయి. ఇంకా ఎండిన టమాటాలు మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలను దూరం చేస్తాయి..
మన డైట్‌లో డ్రై టమాటాలు చేర్చుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. డ్రై టమాటాలలో విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. తీవ్రమైన ఇన్ఫెక్షన్ల నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తుంది. వీటి కారణంగా న్యూమెనియా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పుచాలావరకు తగ్గుతుంది. ఇమ్యూనిటి తక్కువగా ఉన్నవారు విటమిన్ సి తీసుకోవడం చాలా ఉత్తమం. టమాటాలో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థ పని తీరును ఇది మెరుగుపరుచుతుంది.
ఎండిన టమాటాలు డైరెక్టుగా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.. లేదంటే మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు.. కాస్త దోరగా ఉన్న టమాటాలు తెచ్చుకుని నాలుగు ముక్కులుగా కట్‌ చేసుకోండి.. కావాలంటే..గింజలు తిసేయండి.. వీటికి కాస్త ఉప్పు పట్టించి.. ఎండలో రోజూ ఉదయం ఎండపెట్టండి.. ఇలా నాలుగు రోజులు చేస్తే..అందులోని వాటర్‌ అంతా పోతుంది.. టమోటాలు ఎండిపోతాయి.. వీటిని గాలిచొరబడని డబ్బాల్లో తేమ లేకుండా చూసుకని నిల్వ చేసుకోవడమే.. ఊర్లల్లో ఇలా టమాటాలు ఎండబెట్టే పచ్చళ్లు పెడతారు..! నిజానికి ఈ ఎండిన టమాట ముక్కలు భలే రుచిగా ఉంటాయి.. పుల్లపుల్లగా, ఉప్పు ఉప్పుగా ఉంటాయి..!

Read more RELATED
Recommended to you

Latest news