తెలంగాణ డిగ్రీ విద్యార్థులకు అలర్ట్. ఇకపై ఒకే సిలబస్, గ్రేడింగ్ విధానం, క్రెడిట్ సిస్టమ్ తీసుకురానుంది విద్యాశాఖ. తెలంగాణ లోని అన్ని సాంప్రదాయ యూనివర్సిటీల డిగ్రీ కోర్సుల్లో ఒకే సిలబస్, గ్రేడింగ్ విధానం, క్రెడిట్ సిస్టమ్ ఉంచనున్నారు. సమావేశం అయిన UGలో క్రెడిట్ సిస్టమ్, గ్రేడింగ్ సిస్టమ్, సిలబస్‌ను పునర్వ్యవస్థీకరన పై ఏర్పాటు చేసింది నిపుణుల కమిటీ.
2023-24 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే సవరించిన పాఠ్యాంశాలను సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఉపాధి, అభివృద్ధి చెందుతున్న ధోరణులను దృష్టిలో ఉంచుకుని, 2023-24 విద్యా సంవత్సరం నుండి కొత్త కోర్సులు తీసుకురానున్నారు. ఉపాధి కల్పించే విధంగా డిగ్రీలో ను వృత్తి విద్యా కోర్సులు అమలు చేయనున్నారు.