ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు వీటిని తప్పక చెయ్యాలి.. ఎందుకంటే?

-

మనం ఏదొక పని వల్ల బయటకు వెళ్తామ..కొన్ని సందర్భాల్లో అనుకోకుండా వెళితే.. మరి కొన్ని సమయాల్లో కావాలని వెళ్తారు.. కొన్ని సార్లు అనుకున్న పనులు పూర్తి అవుతాయి.. అయితే, కొన్ని సందర్భాల్లో మాత్రం దీనికి విరుద్ధంగా జరుగుతుంది. మనం ఊహించని, కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. జ్యోతిష్యం ప్రకారం మీరు శుభకార్యాల కోసం ఇంటి నుండి బయలుదేరేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు సూచించబడ్డాయి. నమ్మకం ప్రకారం, ఏదైనా పని చేసే ముందు భగవంతుని నామాన్ని స్మరించుకోవాలి.

 

భగవంతుని స్మరించుకోవడం, భగవంతుని నామ జపం చేయడం ద్వారా పనులు ప్రారంభినట్టయితే, ఆయా పనుల్లో విజయం ఖాయం అంటున్నారు. అదేవిధంగా, మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు, జ్యోతిషశాస్త్రంలో పేర్కొన్న కొన్ని పద్ధతులను తప్పకుండా అనుసరించండి.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

మీరు ప్రయాణానికి వెళ్లినట్లయితే, ఇంటి నుండి బయలుదేరే ముందు, పూజా గదిలో భగవంతుని ముందు నెయ్యి దీపం వెలిగించండి. సురక్షితమైన ప్రయాణం కోసం దేవుడిని ప్రార్థించండి. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ముందుగా మీ కుడి పాదం బయట పెట్టేలా చూసుకోండి. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు కొన్ని అసభ్యకరమైన మాటలు మాట్లాడకండి. ఇది మీ ప్రయాణానికి అంతరాయం కలిగిస్తుంది..

ఇక మీరు టూర్ లకు వెళితే మాత్రం అక్కడ ఉండే నది, అగ్ని, గాలి మొదలైన వాటిని అగౌరవపరచవద్దు. ఇవి భగవంతుడు ఇచ్చిన మూడు ప్రత్యేక బహుమతులు అని నమ్ముతారు, కాబట్టి వాటిని ఎప్పుడూ కించపరిచే విధంగా మాట్లాడరాదు. ఇకపోతే ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు, దేవుని పేరు, పవిత్ర మంత్రం లేదా పవిత్రమైన పదాలను పఠించండి. ఇది మీ ప్రయాణాన్ని శుభప్రదంగా చేస్తుంది. ఇంటి నుండి బయలుదేరే ముందు, చీమలకు పిండి, పక్షులకు ధాన్యం, కుక్కలకు ఆహారం, ఆవులకు గడ్డి ఇవ్వండి. వీలైతే ఇంటి దగ్గర ఉన్న గుడిలో కొబ్బరికాయలు కొట్టండి.రహస్యంగా కొన్ని వస్తువులను దానం చెయ్యడం వల్ల అనుకున్న పనులు వెంటనే పూర్తి అవుతాయి..

Read more RELATED
Recommended to you

Latest news