బంపర్ ఆఫర్ కొట్టేసిన అలియా – రన్ బీర్ దంపతులు.. కవలలంటూ..!!

-

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న అలియా భట్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రముఖ బాలీవుడ్ స్టార్ మహేష్ భట్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే అందంతో , నటనతో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది . అంతే కాదు అతి చిన్న వయసులోనే బాలీవుడ్ లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా మరో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది.. ఇక వీరి వైవాహిక జీవితం ఎంతో అద్భుతంగా మొదలవగా..ఇక పది రోజులకే అలియా తాను తల్లినంటూ ప్రకటించింది. ఇకపోతే పెళ్లయిన రెండు నెలలకే ఆలియా భట్ తల్లి అవుతున్నానని ప్రకటించడంతో అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఇక ఈ వార్త కాస్తా నేషనల్ న్యూస్ కావడం గమనార్హం.

ఇప్పుడు అంతకుమించి ఇంటర్నేషనల్ వైడ్ న్యూస్ గా మారిన మరొక విషయం ఏమిటంటే అలియా భట్ కడుపులో ఇద్దరు పిల్లలు పెరుగుతున్నారని సమాచారం. అంటే ఆమె ఏకంగా కవలలకు జన్మనిస్తోంది అంటూ తాజాగా డాక్టర్లు రుజువు చేశారు. అయితే ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు కానీ ఇక ఈ విషయాన్ని రణబీర్ కపూర్ పరోక్షంగా తెలియజేయడం గమనార్హం. ఇక రణబీర్ కపూర్ జూలై 22వ తేదీన తాను నటించిన సంషేరా సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో రణబీర్ అక్కడున్న యాంకర్ కి ఒక టెస్ట్ పెట్టారు. ఇక తాను అడిగే మూడు స్టేట్మెంట్లలో రెండు కరెక్ట్ గా సమాధానం చెప్పాలి అని అన్నాడు. ఇక అందులో భాగంగానే అలియా కవలలకు జన్మనివ్వబోతోంది.రెండవది పౌరాణిక చిత్రంలో నేను నటించబోతున్నాను.. మూడవది నేను సినిమాలకు దూరం కానున్నాను అని రణబీర్ కపూర్ యాంకర్ తో తెలిపాడు.

ఈ మూడు స్టేట్మెంట్లు గనుక మనం చూస్తున్నట్లయితే రణబీర్ కపూర్ సినిమాలను వదిలే అవకాశమే లేదు. ఇక మిగతా రెండు మాత్రం నిజమని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే నిజంగానే వీరికి బంపర్ ఆఫర్ తగిలిందని.. ఇక అలియా భట్ -రణబీర్ కపూర్ ల అదృష్టం మామూలుగా లేదని ఇండస్ట్రీ కోడే కూస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news