‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో మహేశ్, వెంకటేశ్‌ల అసలు పేర్లు ఇవే..!!

-

క్రియేటివ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగువారు అందరూ చక్కగా కుటుంబంతో కలిసి ఈ ఫిల్మ్ చూసి ఆనందించారు. వెంకటేశ్, మహేశ్ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ మూవీ ..శ్రీకాంత్ అడ్డాల మ్యాజికల్ ఫిల్మ్ అని సినీ పరిశీలకులు చెప్తుంటారు.

అన్నదమ్ములుగా వెంకటేశ్, మహేశ్ నటించగా, వారికి జోడీగా అంజలి, సమంత నటించారు. తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్ నటనను చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కామెడీ ప్లస్ ఫ్యామిలీ ఎమోషన్స్ ను చక్కగా చూపించారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధంతో పాటు ప్రేమ, సంపాదన ఇతర విషయాల గురించి సినిమాలో శ్రీకాంత్ అడ్డాల చర్చించారు. ఇక ఇందులో మహేశ్, వెంకటేశ్ పాత్రల పేర్లు ‘చిన్నోడు’, ‘పెద్దోడు’ అని పెట్టారు దర్శకుడు.

అలా సినిమాలోని ప్రతీ సీన్ లో వీరిని అలాగే పిలుస్తారు. కాగా, అసలు వీరి పాత్రల పేర్లు ఏంటి? అని సోషల్ మీడియాలో డిస్కషన్ వచ్చింది. అంజలి, సమంత సైతం ..‘పెద్దోడు’, ‘చిన్నోడు’ అంటూ..సీన్ లో మాట్లాడుతుంటారు.

ఈ క్రమంలోనే అసలు హీరోల పేర్లు అని చర్చించుకుంటున్నారు. కాగా, సినిమాలో ఉన్న డిస్క్రిప్షన్ ..అనగా వివరణ ప్రకారం..మహేశ్ బాబు పేరు ‘సీతారామరాజు’, వెంకటేశ్ పేరు ‘మల్లికార్జున రావు’ అని ఉంది. దాంతో నెటిజన్లు వీటికి సంబంధించిన మీమ్స్ చేస్తున్నారు. చిన్నోడు, పెద్దోడి పేర్లు ఇవా? అని అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news