Telangana: అలిగి ఇంట్లో నుండి వెళ్లిపోయిన భార్య.. స్తంభం ఎక్కిన భర్త

-

అలిగి ఇంట్లో నుండి భార్య వెళ్లిపోయిన నేపథ్యంలో.. విద్యుత్ స్తంభం ఎక్కాడు ఆమె భర్త. ఈ సంఘటన సైదాబాద్ సింగరేణి కాలనీలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఉండే మోహన్ బాబు(25) మద్యం మత్తులో శంకేశ్వర్ బజార్ చౌరస్తా సమీపంలోని హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి గందరగోళం చేశాడు.

Aligi left the house, the husband climbed the pole

స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు, మోహన్ బాబు స్తంభం మీదే కూర్చొని సిగరెట్ వెలిగిస్తూ అందరినీ ఆందోళనకు గురిచేశాడు. గంటన్నర పాటు పోలీసులకు చుక్కలు చూపించాడు. చివరకు పోలీసులే స్తంభం ఎక్కి సముదాయించి కిందకు దించారు. ఇతడు రెండేళ్లలో ఐదుసార్లు ఇలా విద్యుత్ స్తంభం ఎక్కాడు.. భార్య తిట్టినా, కోపం వచ్చినా ఇలాంటి పనులు చేస్తాడని తెలిపారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news