టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం.. ఆ నటుడు మృతి

-

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఒకరి తర్వాత మరొకరు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. దీంతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోతోంది. కాగా ప్రముఖ సినీ నటుడు అల్లం గోపాలరావు ఈరోజు మృతి చెందారు. ఈరోజు ఉదయం 8 గంటలకు తన నివాసంలో అనారోగ్య సమస్యల కారణంగా అల్లం గోపాలరావు మృతి చెందారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

Allam Gopala Rao passes away
Allam Gopala Rao passes away

అల్లం గోపాలరావు పెద్ద కుమారుడు సీరియల్స్ తో పాటుగా సినిమాల్లో కూడా నటిస్తున్నారు. గోపాలరావు గారి అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4 గంటలకి మహా ప్రస్థానంలో నిర్వహించనున్నారు. గోపాలరావు భౌతిక కాయాన్ని సందర్శించి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. అలాగే ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ మేనేజ్మెంట్ కమిటీ గోపాలరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. గోపాలరావు మరణ వార్త తెలిసి ఆయన భార్య విమల కన్నీటి పర్యంతమవుతున్నారు. గోపాలరావుకు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news