రేపు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సక్సెస్ మీట్ : స్పెషల్ గెస్ట్ గా బన్నీ

-

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని మరియు స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే జంటగా నటించిన రొమాంటిక్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ga2 పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను బన్నీవాసు మరియు వాసువర్మ సంయుక్తంగా నిర్మించారు.

ఇక ఈ సినిమా గీతా ఆర్ట్స్ సమర్పణలో ఈ దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదీన థియేటర్లలో విడుదలైంది. అయితే విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు చాలా సక్సెస్ ఫుల్ గా ఈ సినిమా నడుస్తుంది. కేవలం రెండు రోజుల్లోనే 18 కోట్ల వసూళ్లను సాధించింది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.

మొత్తానికి ఈ సినిమా హిట్ టాక్ ను తెచ్చుకుంది. దీంతో రేపు సాయంత్రం 6 గంటల సమయంలో సక్సెస్ మీట్ నిర్వహించనున్నట్లు ఆ చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ప్రకటించింది. హైదరాబాదులోని జె ఆర్ సి కన్వెన్షన్ సెంటర్ లో జరిగే ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news