అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఆ డైరక్టర్ తోనే..!!

-

అల్లు అర్జున్ అంటే తెలుగు ప్రజలలో విపరీతమైన క్రేజ్ వుంది.ఇక పుష్ప తర్వాత తన ఫాలోయింగ్ మామూలుగా లేదు.సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన‘పుష్ప’ సినిమా ఊహించని  వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో పాటలు , స్టైల్స్ అన్ని విపరీతంగా ఆదరణ పొందాయి. ఈ సినిమా ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు పుష్ప 2కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు పుష్ప 2 స్క్రిప్ట్ కోసం సుకుమార్ చాలా టైమ్ కేటాయించి పనిచేశారు. ఈ సారి కేజీఫ్ కంటే ఎక్కువ మోతాదులో ట్విస్టులు మరియు యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టుకున్నారట.అయితే  ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాని తెలుగు సినిమా హీరోలు అందరూ ఒక సినిమా సైట్స్ మీద వుండగానే మరో సినిమా కన్ఫర్మ్ చేసుకుంటారు. అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా మీద ఆసక్తి నెలకొంది.

అయితే ఆ అవకాశం గతంలో తనతో సినిమా తీసిన సురేందర్ రెడ్డి కే అవకాశం ఉందని అంటున్నారు. మరో టాక్ ప్రకారం బాలివుడ్ దర్శకుడు కూడా లైన్ లో ఉన్నాడని తెలుస్తోంది.సురేందర్ రెడ్డి గతంలో రేసుగుర్రం వంటి సూపర్ హిట్ ఇచ్చాడు. తాను ప్రస్తుతం ఏజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల లో బిజీ గా ఉన్నారు. రిలీజ్ డేట్ కోసం చాలా ప్రయత్నాలు చేసిన మీదట ఫిబ్రవరి నెలలో విడుదల చేయాలని నిర్ణయించారు. ఇక అల్లు అర్జున్ కూడా తన తదుపరి సినిమా కోసం సురేందర్ రెడ్డి చెప్పిన లైన్ ఒకే చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news