కలర్ ఫోటో సినిమా కి అల్లు అర్జున్ ఫిదా.. ఏమన్నారో తెలుసా..!

మొన్నటి వరకు హీరో స్నేహితుడి క్యారెక్టర్లు చేస్తూ వచ్చిన సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారిపోయిన విషయం తెలిసిందే. సుహాస్ చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ కలర్ ఫోటో. ఇటీవల ఓ టి టి వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే . సహజత్వానికి దగ్గరగా ఉండే లవ్ స్టోరీ ప్రస్తుతం ప్రేక్షకులు అందరినీ ఎంతగానో ఆకర్షిస్తోంది. చిన్న సినిమా అయినప్పటికీ ఎంతో మంది ప్రముఖులను ఫిదా చేస్తుంది ఈ సినిమా.

ఇప్పటికి ఎంతో మంది ప్రముఖులు ఈ సినిమా చూసి ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. సినిమా పై టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ప్రశంసలు కురిపించారు. ఇటీవలే కలర్ ఫోటో సినిమా చూసిన అల్లు అర్జున్ ఈరోజు చిత్ర బృందాన్ని కలిసి అభినందించారు. కలర్ ఫోటో ఒక స్వీట్ లవ్ స్టోరీ అంటూ తెలిపిన అల్లు అర్జున్ ఎమోషనల్ మ్యూజిక్ అదిరిపోయింది అని నటులందరూ ఎంతో అద్భుతంగా నటించారు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఒక మొక్కను బహుకరించారు.