Pushpa: యూట్యూబ్ లో నయా రికార్డ్ చేసిన‌ శ్రీ‌వ‌ల్లి సాంగ్.. ఎన్ని మిలియ‌న్స్ వ్యూస్‌ వ‌చ్చాయంటే?

-

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో హ్యాట్రిక్ చిత్రంగా తెర‌కెక్కుతున్నది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తుంది.

ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనాలు క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక పాటకు అనూహ్యం స్పంద‌న వ‌చ్చింది. తాజా చిత్రం నుంచి చూపే బంగారమాయెనే శ్రీవల్లి.. నవ్వే నవరత్నమాయెనే అంటూ సాగే సాంగ్ విడుదలైంది. చిత్రంలోని రష్మిక మందన శ్రీ‌వ‌ల్లి పాత్ర చేస్తుంది.

ఈ సాంగ్ ట్యూన్స్ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ పాట‌కు చంద్రబోస్ అందించిన లిరిక్స్ అందించ‌గా.. దేవి శ్రీ స్వరాలు అందించారు. సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరామ్ ఈ పాటను అలపించారు. మెలోడియస్‌గా సాగిపోతున్న ట్యూన్స్ సంగీత ప్రియులను ఫిదా చేస్తున్నాయి. ఈ సాంగ్ విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ లో రికార్డులను సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ పాట తెలుగులో 5 మిలియన్ కు పైగా వ్యూస్ ను దక్కించుకుంది. అలాగే ఈ మధ్యే విడుదలైన రష్మిక మందన్న ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news