పుష్ప-2 సినిమా ప్రీమియర్స్ షో వీక్షించేందుకు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్దకు రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళా మరణించింది. ఆమె కుమారుడు శ్రీతేజ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ తరుణంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ కావడం.. చంచల్ గూడ జైలుకు తరలించడం.. వెంటనే మధ్యంతర బెయిల్ రావడం ఇలా అన్ని చక చక జరిగిపోయాయి.
ఆ తరువాత నిన్న నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. రెగ్యులర్ బెయిల్ పూచీకత్తు సమర్పించారు. ఆ తరువాత మెజిస్ట్రేట్ ఎదుట పత్రాలపై సంతకాలు చేశారు. అల్లు అర్జున్ వెంట మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు నిన్న రూ.50వేల చొప్పున 2 పూచీకత్తులతో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.