“పుష్ప” పై కన్‌ఫ్యూజన్‌లో బన్నీ…!

-

ఒకవైపు షూటింగులు ఊపందుకుంటున్నాయి. హీరోలంతా సెట్స్‌కి వెళ్తున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఇంకా కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నాడు. లాక్‌డౌన్‌ కంప్లీట్ అయి అన్‌లాక్‌లోకి వెళ్లిపోయినా ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. ఇప్పటికీ ప్రశ్నలతోనే సావాసం చేస్తున్నాడు. ఇంతకీ బన్నీకి ఉన్న కన్‌ఫ్యూజన్స్ ఏంటి?

అల్లు అర్జున్ “పుష్ప’కి విలన్ కష్టాలు తప్పట్లేదు.షూటింగులు రీస్టార్ట్ అవుతున్న ఇంకా విలన్ పై క్లారిటీ రావట్లేదు.మొదట విజయ్‌ సేతుపతిని విలన్ గా ఓకే చేశారు సుకుమార్.కాని ఇమేజ్ పై డిఫెన్స్ లో పడ్డ విజయ్ సేతుపతి ఓన్లి తెలుగుకి ఓకే తమిళ్ కి మాత్రం నో అన్నారు. కొన్నాళ్లు మాధవన్‌ విలన్‌ అని ప్రచారం జరిగినా “పుష్ప’లో నటించట్లేదని మాధవన్ క్లారిటీ ఇచ్చారు. దీంతో పుష్ప మూవీ విలన్ కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news