విద్యతో పాటు విద్యార్థులు సాంకేతిక నైపుణ్యత పెంపొందించుకోవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద జిల్లా పరిషత్ పాఠశాల 150వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మొగిలిగిద్ద గ్రామానికి అడ్వాన్స్ టెక్నాలజీ మంజూరు చేశామని తెలిపారు. గతంలో నోటిఫికేషన్లు ఇస్తే సంవత్సరాల సమయం పట్టేది. తమ ప్రభుత్వ హయాంలో కేవలం 55 రోజుల్లోనే టీచర్లను నియమించిందని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు యూనివర్సిటీలను మంజూరు చేశారని గుర్తు చేశారు.
పేదలు చదువుకోవాలనే ఉద్దేశంతోనే రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చారని.. గత ప్రభుత్వం వైస్ ఛాన్స్ లర్లను నియమించలేదు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైస్ ఛాన్స్ లర్లను నియమించామని తెలిపారు. తండాలు, మారుమాల ప్రాంతాల్లోని పిల్లలు విద్యకు దూరం కాకూడదని సూచించారు. పేదలు చదువుకొని రాణించాలని ప్రొఫెసర్ల వయస్సును పెంచడం జరిగిందని తెలిపారు. 21వేల కోట్లను విద్యాశాఖకు కేటాయించడం జరిగిందని తెలిపారు.