రగులుతున్న అమరావతి గ్రామాలు.. ఏడో రోజుకు చేరిన నిరసనలు..

-

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల ప్రకటనపై వెల్లువెత్తుతున్న నిరసనలు నేటితో ఏడో రోజుకు చేరాయి. రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలతోపాటు ప్రజా సంఘాలు, విద్యార్థులు ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా నిలుస్తున్నారు. తుళ్లూరులో టెంట్లు వేసేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

నేడు మందడం రహదారిపై ఆందోళన చేపట్టేందుకు ఆ ప్రాంత రైతులు సిద్ధమయ్యారు. అప్రమత్తమైన పోలీసులు వారిని రోడ్డుపైకి రాకుండా అడ్డుకుంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. న్యాయవాదులు ‘చలో హైకోర్టు’కు పిలుపునిచ్చారు. ‘సేవ్ అమరావతి’ పేరిట సిద్ధార్థ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో ర్యాలీ నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news