కెసిఆర్ కోసం రంగంలోకి దిగిన మోడిషా…?

-

దేశంలో ఇప్పుడు బిజెపి బలహీనపడుతుంది. గత ఏడాది కాలంగా 5 రాష్ట్రాల్లో బిజెపి అధికారం కోల్పోయింది. రమణ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, రఘుబర్ దాస్, వసుంధరా రాజే, దేవేంద్ర ఫద్నవీస్ వంటి కీలక నేతలు ఉన్న రాష్ట్రాలను బిజెపి కోల్పోయింది. కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదాన్ని అందుకున్న బిజెపి ఏడాదిగా 5 రాష్ట్రాలను కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు సమర్పించుకుంది. బలమైన రాజకీయ శక్తిగా ఎదిగే క్రమంలో, బిజెపి చేస్తున్న తప్పులకు ఒక్కో రాష్ట్రం జారిపోవడం ఆందోళన కలిగించే అంశం.

ఈ నేపధ్యంలో కొత్త మిత్రపక్షాల కోసం బిజెపి పెద్దలు అడుగులు వేస్తున్నారు. ఇన్నాళ్ళు భయపెట్టి తమ దారిలోకి తెచ్చుకోవాలనే ఆలోచన చేసిన నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయం ఇప్పుడు బ్రతిమిలాడుకునే ప్రయత్నాలను చేస్తున్నారు. వచ్చే ఏడాది బీహార్, ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో బిజెపి కనుక గెలవకపోతే మాత్రం చుక్కలు కనపడినట్టే. ఈ తరుణంలో దక్షినాది రాష్ట్రాల్లో పాగా వేయడానికి బిజెపి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఉత్తరాది ప్రభావం ఉండే తెలంగాణా మీద దృష్టి పెట్టింది.

ఝార్ఖండ్ లో అధికారం కోల్పోయిన భారతీయ జనతా పార్టీ, తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తో స్నేహం కోసం ప్రయత్నాలు చేస్తుంది. కెసిఆర్ తో వైర౦ వద్దని భావిస్తున్న బిజెపి, ఎన్నార్సి విషయంలో తెలంగాణా ఇప్పటికే మద్దతు ఇచ్చేది లేదని చెప్పింది. ఝార్ఖండ్ లో అధికారం కోల్పోకుండా ఉండి ఉంటే పెద్ద ఇబ్బందులు వచ్చేవి కావు. ఈ తరుణంలో కెసిఆర్ తో స్నేహం ఉంటె తెలంగాణా మద్దతు తీసుకోవచ్చు అని భావిస్తున్నారు మోడిషా. అందుకే కెసిఆర్ కోసం మోడిషా ఇద్దరూ రంగంలోకి దిగినట్టు సమాచారం. త్వరలో ఆయనతో చర్చలు జరిపే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news