అమర్నాథ్ వరదల్లో 15 కి చేరిన మృతుల సంఖ్య.. యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

-

జమ్మూకశ్మీర్‌ వర్షం బీభత్సం సృష్టించింది. గత మూడు రోజులుగా అక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. చార్ ధామ్ యాత్రలో భాగంగా నిర్వహించే అమర్ నాథ్ యాత్రపై వరుణుడు పంజా విసిరాడు. జమ్మూకశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలోని అమర్ నాథ్ క్షేత్రం వద్ద భారీ వర్షం కురిసింది. దాంతో ఆలయ పరిసరాలు వరదలు పోటెత్తాయి. దీంతో.. ఒక్కసారిగా వరద నీరు పెరిగిపోవడంతో పలువురు భక్తులు అందులో చిక్కుకున్నారు.

పక్కనే ఉన్న గుహ చుట్టు పక్కల 12 వేల మంది వరకు భక్తులు ఉన్నట్టు తెలుస్తోంది.వారిలో కొందరి ఆచూకీ తెలియరాలేదు. వేలమంది భక్తులు వరద ప్రభావానికి గురైనట్టు భావిస్తున్నారు అధికారులు. అయితే.. ఇప్పటివరకు 15 మంది మృతి చెందినట్టు అధికారులు గుర్తించారు.జూన్ 30న అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షాలు పడుతుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కొండచరియలు విరిగి పడుతుండడంతో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. బల్తాల్ మరియు పహాల్గాం బేస్ క్యాంప్ నుంచి ఈ యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news