అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌: ఈ ఫోల్టబుల్‌ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్‌

-

అక్టోబర్‌ 8 నుంచి అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్ సేల్‌ స్టాట్‌ అవబోతుంది. ఇప్పటికే ఈ సేల్‌లో స్మార్ట్‌ టీవీలపై 60 శాతం డిస్కౌంట్‌ ఉంటుందని ప్రకటించారు, ఐఫోన్‌ 12, 13, 14 ఫోన్లపై కూడా ఈ సేల్‌లో భారీ తగ్గింపు ఉండనుంది. వాటితో పాటు. ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై కూడా అమెజాన్‌ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

Motorola Razr 40 :

మోటోరోలా రేజర్ 40 ఫోల్డబుల్ ఫోన్ లో 6.9 ఇంచ్ ల ఫోల్డబుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. అలాగే, 1.5 ఇంచ్ ల కవర్ డిస్ ప్లే ఉంటుంది. ఇందులో 8 జీబీ ర్యామ్ తో స్నాప్ డ్రాగన్ 7 జనరేషన్ 1 చిప్ సెట్ ఉంటుంది. ఇందులో 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ ఉంటుంది. ఈ ఫోన్ ఒరిజినల్ ధర రూ. 99,999 కాగా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో దీన్ని రూ. 44999 లకే సొంతం చేసుకోవచ్చు.

Motorola Razr 40 Ultra :

ఈ మోటొరోలా రేజర్ 40 అల్ట్రా ఫోల్డబుల్ ఫోన్ లో 6.9 ఇంచ్ ల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. అలాగే, 3.6 ఇంచ్ ల కవర్ డిస్ ప్లే ఉంటుంది.  ఇందులో స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 చిప్ సెట్ ఉంటుంది. ఇందులో 128 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ ఒరిజినల్ ధర రూ .119999 కాగా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో దీన్ని రూ. 72999 లకే సొంతం చేసుకోవచ్చు.

Techno Phantom V Fold :

టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్: ఈ ఫోల్డబుల్ ఫోన్ లో 7.85 ఇంచ్ ల 2కే ఎల్టీ పీఓ డిస్ ప్లే ఉంటుంది. అలాగే, 6.42 ఇంచ్ ల ఎఫ్ హెచ్ డీ సబ్ డిస్ ప్లే ఉంటుంది. ఇందులో 50 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ ఒరిజినల్ ధర రూ. 109999 కాగా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో దీన్ని రూ. 80999 లకే సొంతం చేసుకోవచ్చు.

Techno Phantom V Flip :

ఈ టెక్నో ఫాంటమ్ వీ ఫ్లిప్ ఫోల్డబుల్ ఫోన్ లో 6.9 ఇంచ్ ల అమొలెడ్ డిస్ ప్లే ఉంటుంది. అలాగే, 1.32 ఇంచ్ ల కవర్ డిస్ ప్లే ఉంటుంది.  ఇందులో 16 జీబీ ర్యామ్ తో డీ 8050 5 జీ ప్రాసెసర్ ఉంటుంది. ఇందులో 64 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ ఒరిజినల్ ధర రూ. 71999, కాగా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో దీన్ని రూ. 47999 లకే సొంతం చేసుకోవచ్చు.

Samsung Galaxy Z Flip5 :

ఈ సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ఫోల్డబుల్ ఫోన్ లో 6.7 ఇంచ్ ల అమొలెడ్ 2 ఎక్స్ డిస్ ప్లే ఉంటుంది. అలాగే, 3.4 ఇంచుల కవర్ డిస్ ప్లే ఉంటుంది.  ఇందులో 8 జీబీ ర్యామ్‌తో స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్ 2 చిప్ సెట్ ఉంటుంది. 128 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ ఒరిజినల్ ధర రూ. 102999, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో దీన్ని రూ.92999 లకే సొంతం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news