నిర్మాణ రంగంలోకి అమెజాన్ ప్రైమ్.. అక్షయ్ కుమార్ హీరోగా సినిమా..

ఇండియలో ఓటీటీలో మేజర్ ఫీల్డ్ ఆక్రమించుకున్న ఫ్లాట్ ఫామ్ ఏదైనా ఉందంటే టక్కున గుర్తొచ్చే పేరు అమెజాన్ ప్రైమ్ వీడియో. ఇందులో ఉన్న కంటెంటే అమెజన్ ప్రైమ్ కి సబ్ స్క్రయిబర్స్ పెరగడానికి కారణమైంది. ప్రాంతీయ భాషల్లో ఎక్కువ కంటెంట్ ఉండడం వల్ల అందరికీ చేరుకోగలిగింది. లాక్డౌన్ టైమ్ లో థియేటర్లు మూతపడి ఉన్న తర్వాత కూడా డైరెక్టుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో సినిమాలు రిలీజ్ చేసారంటే దాని రేంజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఐతే ఇప్పటి వరకు నిర్మించిన సినిమాలనే కొనుక్కున్న అమెజాన్, ఈ సారి నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుంది. వెబ్ సిరీస్ లు తప్పిస్తే, డైరెక్టుగా అమెజాన్ ప్రైమ్ నిర్మాణంలో సినిమాలు రాలేదు. తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా అది జరగబోతుంది. రామ్ సేతు పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో కూడుకున్నది. రాముడు నిర్మించిన వారధిపై సాగే ఈ కథని తెరమీద తీసుకురావడానికి అమెజాన్ ప్రైమ్ కూడా భాగస్వామ్యం అందుకుంది. జాక్వెలైన్ ఫెర్నాండేజ్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.