నేషనల్ లెవల్ లో పెరిగిన టి‌ఆర్‌ఎస్ గ్రాఫ్ ?

-

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్ మరియు బిజెపి పార్టీలకు జన్మ తిరిగి పోయే విధంగా టిఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీ స్థానాలు గెలవడంతో టిఆర్ఎస్ పార్టీ జాతీయస్థాయిలో రికార్డ్ సృష్టించిందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటివరకు ఈ విధంగా ఏ పార్టీకి గెలవలేదని కానీ టిఆర్ఎస్ పార్టీ గెలిచిందని దాదాపు 120 మున్సిపాలిటీ స్థానాల్లో 109 గెలవటం అనేది మామూలు విషయం కాదని దాదాపు 91% మున్సిపాలిటీలు టిఆర్ఎస్ పార్టీ గెలిచిందని దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు అని అంటున్నారు.

Image result for kcr

అయితే తాజాగా వచ్చిన రిజల్ట్ బట్టి టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఈ క్రమంలో గెలిచిన తర్వాత కెసిఆర్ ప్రెస్ మీట్ పెట్టడం తో జాతీయ స్థాయిలో ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల జాతీయ మీడియాలో కెసిఆర్ గురించి హైలెట్ వార్తలు రావడంతో నేషనల్ లెవెల్ లో టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన ట్లు అంతేకాకుండా టిఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ కూడా పెరిగినట్లు వార్తలు వినపడుతున్నాయి.

 

ముఖ్యంగా సి.ఎ.ఎ, ఎన్నారై బిల్లులపై కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు మోడీని ఢీ కొట్టే విధంగా ఉండటంతో భవిష్యత్తులో టిఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ మోడీకి ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది అని అంటున్నారు మేధావులు. 

Read more RELATED
Recommended to you

Latest news