కోడెల మరణానికి చంద్రబాబే కారణం : అంబటి సంచలనం

సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన కామెంట్స్ చేశారు. కోడెల శివప్రసాదరావు మరణానికి తెలుగుదేశం పార్టీ నేతలు మరియు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కారణమని వివాదాస్పద వ్యక్తలు చేశారు. కోడెల వర్ధంతి కార్యక్రమం లో మాజి మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు అంబటి రాంబాబు.

అయ్యన్నపాత్రుడు కి పిచ్చి పట్టిందని.. అధికారం కోల్పోయి అవాకులు చవాకులు పేలుతున్నారని నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి జగ మోహన్ రెడ్డి ని పట్టుకొని అసభ్య పదజాలం వాడుతున్నారని నిప్పులు చెరిగారు. మంత్రుల మీద తీవ్ర వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని.. అయ్యన్న పాత్రుడు కి మతి భ్రమించి మాట్లాడుతున్నారని.. ఆయన వెంటనే భాష ను మార్చుకోవాలని డిమాండ్ చేశారు. అయ్యన్నపాత్రుడు పై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. టిడిపి పార్టీ కి ఏపీ ప్రజలు తగిన బుద్ది చెబుతారని ఆయన తెలిపారు.