మంత్రి అంబటి రాంబాబు పోలవరం పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని పరిశీలించారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్-2 శాండ్ ఫిల్లింగ్ను మంత్రి అంబటి పరిశీలించారు. ఇదే సమయంలో స్పిల్వే వద్ద కుంగిన గైడ్ బండ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ.. గైడ్బండ్ కుంగిన ఘటనపై ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. గైడ్ బండ్ కుంగడం ప్రమాదభరితమైనది కాదని.. అయినప్పటికీ తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకునే ప్రయత్నం జరుగుతుందన్నారు.
స్పిల్ వే పై ఒత్తిడి తగ్గించేందుకు గైడ్ బండ్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందన్నారు. పోలవరంలో జరుగుతున్న విషయాలను రహస్యంగా దాచవలసిన అవసరం లేదని.. బయట నుంచి ప్రజలను తీసుకువచ్చి భజన చేయించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదని మంత్రి వివరించారు. పోలవరం సందర్శించేందుకు ఎవరైనా అనుమతి తీసుకుని రావచ్చన్నారు మంత్రి అంబటి రాంబాబు. ప్రాజెక్ట్ రాజకీయ వేదిక కాదు..పవిత్రమైన ప్రాంతమని.. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.