భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం ప్రారంభానికి సిద్ధమైంది. హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ విగ్రహం.. దేశంలో ఇప్పటివరకూ ఉన్న అంబేడ్కర్ విగ్రహాల్లోకెల్లా ఎత్తయినదిగా ఖ్యాతి గడించబోతోంది.
పార్లమెంటు ఆకారంలో 50 అడుగుల పీఠం, ఆపైన 125 అడుగుల నిలువెత్తు లోహ విగ్రహాన్ని ఈ నెల 14న అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ మనవడు ప్రకాష్ అంబేడ్కర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. అయితే.. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను రిలీజ చేసింది కేసీఆర్ సర్కార్.
The 125-foot-tall statue of Dr. B. R. #Ambedkar statue is all set for inauguration on the stalwart's birth anniversary, April 14, 2023.
It is erected on the banks of Hussain Sagar & near upcoming new #Telangana State #secretariat named after Dr. Ambedkar.#JaiBhim #JaiTelangana pic.twitter.com/mfOXm56UEB
— Telangana Digital Media Wing (@DigitalMediaTS) April 13, 2023