బ్రేకింగ్: ఇండియాకు భారీగా ఆక్సీజన్ పంపిన అమెరికా

భారత్ లో ప్రతీ రోజు 3 లక్షలకు పైగా కేసులు నమోదు కావడంతో మనకు ప్రపంచ దేశాల నుంచి సహాయ సహకారాలు వస్తున్నాయి. అమెరికా నుంచి భారీగా ఆక్సీజన్ భారత్ కు వస్తుంది. నేడు ఉదయం ఆక్సీజన్ కంటైనర్ లను అమెరికా నుంచి మన అధికారులు దిగుమతి చేసుకున్నారు. 318 కంటైనర్ లను ఇండియాకు పంపింది. ఇక బ్రిటన్ కూడా మనకు తన వంతుగా సహాయం చేస్తుంది.

కరోనా వాక్సిన్ తయారికి సంబంధించి బ్రిటన్ నుంచి భారీగా ముడి పదార్ధాలు మన దేశానికి వస్తున్నాయి. కోవిడ్ -19 వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన ముడి పదార్థాల వనరులను అమెరికా కూడా పంపిస్తుంది. అలాగే మందులను కూడా అమెరికా బ్రిటన్ మన దేశానికి పంపిస్తున్నాయి.