బ్రేకింగ్ ; నిర్మల్ కు చేరుకున్న అమిత్ షా

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్‌ జిల్లాకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా చేరుకున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలు దేరిన అమిత్‌ షా… కాసేపటి క్రితమే నిర్మల్‌ కు చేరుకున్నారు. నిర్మల్‌ లో తెలంగాణ విమోచన దినోత్సవ సభ ఉన్న నేపథ్యం లో ఇవాళ తెలంగాణ పర్యటనకు వచ్చారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా.

మరి కాసేపట్లోనే ఈ తెలంగాణ విమోచన సభ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3.15 నుంచి 4.50 గంటల వరకు నిర్మల్ సభలో పాల్గొననున్నారు అమిత్ షా. ఇక సాయంత్రం 5 గంటలకు హెలికాఫ్టర్ లో నాందేడ్ కు చేరుకోనున్న అమిత్‌ షా… అక్కడ నుంచి ఢిల్లీ కి చేరుకోనున్నారు. రాత్రి 7.30 గంటలకు తిరిగి ఢిల్లీకి చేరుకోనున్నారు కేంద్ర హోంమంత్రి. ఇక ఈ సభ నేపథ్యం లో… తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు అన్ని ఏర్పాటు చేశారు.  దాదాపు ఈ సభకు లక్ష మంది వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.