రాహుల్.. ముందు ఆ విషయం తెలుసుకోవాలి : అమిత్ షా

-

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై బీజేపీ తీవ్రంగా విమర్శలు చేస్తోంది. దీనికి కాంగ్రెస్ కూడా ఘాటుగానే స్పందిస్తోంది. ఈ యాత్రపై తీవ్రంగా బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా.. రాహుల్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. రాహుల్ ముందుగా దేశ చరిత్రను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. విదేశీ బ్రాండ్‌ టీషర్ట్‌ ధరించి.. ‘భారత్ జోడో యాత్ర’కు వెళ్లారని ఎద్దేవా చేశారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో శనివారం నిర్వహించిన ఓ పార్టీ కార్యక్రమంలో అమిత్‌ షా ఈ మేరకు మాట్లాడారు.

‘గతంలో పార్లమెంట్‌లో రాహుల్‌ గాంధీ ఇచ్చిన ప్రసంగాన్ని గుర్తుచేయాలనుకుంటున్నా. ఆయన.. భారత్‌ను అసలు ఒక దేశమే కాదన్నారు. ఈ విషయాన్ని ఆయన ఏ పుస్తకంలో చదివారు? ఇదొక దేశం.. దీని కోసం లక్షలాది మంది తమ ప్రాణాలను త్యాగం చేశారు’ అని అమిత్‌ షా అన్నారు. ‘రాహుల్ గాంధీ దేశాన్ని ఏకం చేసేందుకు వెళ్లారు. కానీ, అంతకుముందు ఆయన దేశ చరిత్రను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది’ అని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news