అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం 550 ఏళ్లుగా పోరాటం జరుగుతోందని బీజేపీ సీనియర్ నేత అమిత్ సూర్యాపేట బీజేపీ సభలో వెల్లడించారు. ‘అయోధ్యలో రామమందిర నిర్మాణం : ‘వద్దా? కావాలా? 550 ఏళ్లుగా శ్రీరాముడు టెంట్లోనే ఉన్నారు. ఇప్పుడు రామ మందిర నిర్మాణంతో మన కల సాకారం అవుతోంది. వచ్చే ఏడాది జనవరి 22న మోదీ ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. అందరూ అయోధ్య రామయ్యను దర్శించుకోవడానికి సిద్ధం కావాలి’ అని పిలుపునిచ్చారు.
అమిత్ షా చేసిన హిందీ ప్రసంగాన్ని.. కిషన్ రెడ్డి తెలుగులోకి అనువదించారు. ఈ సందర్భంగా అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే- వెనుకబడిన వర్గాలకు పట్టం కడతామని ప్రకటించారు. తమ ప్రభుత్వం ఏర్పాటైతే బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిగా చేస్తామని తేల్చి చెప్పారు. బీసీల సంక్షేమానికి కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ దేశానికి బీసీలే వెన్నెముక అని అభివర్ణించారు అమిత్ షా. బీసీల కోసం ఇప్పటికే అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్నామని గుర్తు చేశారు. వారికి రాజ్యాంగబద్ధమైన అన్ని హక్కులనూ కల్పిస్తామని స్పష్టం చేశారు. దీన్ని కూడా తాము చిత్తశుద్ధితో అమలు చేస్తామనీ చెప్పారు.