ఏప్రిల్‌ 14న తెలంగాణలో అమిత్‌ షా పాదయాత్ర !

-

ఏప్రిల్ 14 ప్రజా సంగ్రామ పాదయాత్ర రెండో విడతకు అమిత్ షాను ఆహ్వానించామని.. ఆయన వస్తారని బండి సంజయ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తప్పు చేసి వివాదాలలో పడ్డాడని.. సీఎం కి సిగ్గు ఉండాలి.. కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కేంద్రం వడ్లు కొంటాను అని చెప్పింది.. కొనే బాధ్యతలు మేము తీసుకుంటామన్నారు. దేశ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు పై పాలసీ ఉంటుందని… ఇండియా గేట్ దగ్గర, బిజెపీ ఆఫీస్ దగ్గర వడ్లు పోయడానికి జే సి బీ లు దొరకడం లేదా అని నిలదీశారు.

పార్లమెంట్ లో ధాన్యం కోనుగోలు పై రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని పీయూష్ గోయల్ క్లారిటీ గా చెప్పారని.. యూపీఏ లో కంటే ఎన్ డీ ఏ ప్రభుత్వం లో రెట్టింపు ధాన్యం కొంటున్నామని పేర్కొన్నారు. దేశంలో వడ్లు కొనుగోళ్లు లో తెలంగాణ రెండో రాష్ట్రంలో ఉందని.. కేంద్రం వడ్లు కొనుగోలు కి 84,120 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందని చెప్పారు. వానా కాలం లో 40 లక్షలు మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తో అగ్రిమెంట్ జరిగిందని… అదనంగా 24 లక్షలు మెట్రిక్ టన్నుల కొంటానని కేంద్రం చెప్పిందని వెల్లడించారు. బాయిల్డ్ రైస్ కి, రా రైస్ కి రైతులు కి ఏమి సంబంధం… ఇప్పటి వరకు అదనంగా ఇస్తామన్న బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news