దీదీ సర్కార్​ను​ గద్దె దించేది బీజేపీనే.. బంగాల్​ పర్యటనలో అమిత్ షా

-

వచ్చే ఎన్నికల్లో బంగాల్ లో ఉన్న టీఎంసీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. తాజాగా బంగాల్ లో పర్యటించిన షా.. బీర్భూమ్ జిల్లాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని 42 పార్లమెంట్​ నియోజకవర్గాల్లో 35 చోట్ల తమను గెలిపిస్తే.. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఎంసీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ ప్రభుత్వం.. రాష్ట్రంలో ‘హిట్లర్ తరహా పాలన’ను కొనసాగిస్తోందని షా దుయ్యబట్టారు. బంగాల్​లోని  షా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవలే జరిగిన శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన హింసను ప్రస్తావించిన షా.. తాము అధికారంలో ఉంటే ఇటువంటి ఘటనలు జరిగేవా అని ప్రజలను ప్రశ్నించారు. రాష్ట్రంలో శ్రీరామ నవమి శోభాయాత్రలను జరుపుకోకూడదా? శోభాయాత్రలపై దాడులు చేస్తారా? అని అడిగారు. ఈ దారుణానికి కారణం ముఖ్యమంత్రి మమత బెనర్జీ అనుసరిస్తున్న బుజ్జగింపు రాజకీయాలేనని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే, శ్రీరామ నవమి శోభాయాత్రలపై దాడి చేసే ధైర్యం ఎవరికీ ఉండదని అన్నారు. మమత బెనర్జీ, ఆమె మేనల్లుడు పాల్పడుతున్న చర్యలకు వ్యతిరేకంగా పోరాడగలిగేది బీజేపీ మాత్రమేనని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news