ప్రభాస్ పెళ్లి జరిగేది ఎప్పుడో తెలుసా..?

బాహుబలి హీరో ప్రభాస్ పెళ్లి గురించి ఎన్నో సంవత్సరాల పాటు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఒక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని అతను గాఢంగా ప్రేమిస్తున్నాడని, పెళ్లి చేసుకుంటున్నాడు అని ఎన్నో పుకార్లు షికారు చేసిన సందర్భాలు కోకొల్లలు. అవన్నీ వట్టి అబద్ధాలని, నిజానికి ప్రభాస్ కి మంచి సంబంధం చూశామని… త్వరలోనే పెళ్లి కూడా చేయాలనుకుంటున్నామని కృష్ణంరాజు భార్య శ్యామల దేవి చెప్పుకొచ్చారు.

prabas
prabas

ప్రభాస్ బంధువు సీనియర్ హీరో కృష్ణం రాజు కూడా యంగ్ రెబల్ స్టార్ పెళ్లి గురించి ఒక క్లారిటీ ఇచ్చారు. నిజానికి ఈ నలభై ఏళ్ల వయసున్న ప్రభాస్ కి ఈ సంవత్సరమే పెళ్లి చేయాలనుకున్నారు అతడి కుటుంబ సభ్యులు. కానీ కరోనా వైరస్ కారణంగా ప్రభాస్ పెళ్లి వాయిదా పడింది. ఈ విపత్కర సమయాల్లోనే చాలా మంది ప్రముఖుల పెళ్లిళ్లు అయ్యాయి. కానీ, ప్రభాస్ పెళ్లి చాలా గ్రాండ్ గా చేయాలని కృష్ణంరాజు వాయిదా వేసినట్టు తెలుస్తోంది. దీంతో 2021 వ సంవత్సరంలో ప్రభాస్ పెళ్లి కచ్చితంగా జరుగుతుందని అతని సన్నిహితులు చెబుతున్నారు. మరి అప్పటి లోపు కరోనా వైరస్ ఉదృతి తగ్గుతుందో లేదో చూడాలిక.