పంజాబ్ పోలీసులపై అమృత్‌పాల్ సింగ్ ఫైర్.. వీడియో వైరల్

-

ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ గత కొద్ది రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. తాజాగా అతడి వాయిస్‌తో ఉన్న  ఓ వీడియో సందేశం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండటం చర్చనీయాంశమైంది. ఇందులో అమృత్‌పాల్ పంజాబ్ పోలీసు లపై తీవ్ర విమర్శలు చేశాడు. యూకేకు చెందిన యూట్యూబ్‌ ఛానెల్‌లో ప్రసారమైన ఈ వీడియోను రెండు రోజులు క్రితం ఉత్తర్‌ప్రదేశ్‌లో రికార్డు చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

‘‘పంజాబ్‌ పోలీసులు నన్ను అరెస్టు చేయాలనుకుంటే.. మా ఇంటికి వచ్చి అరెస్టు చేసేవారు. అప్పుడు మేము బాధ్యతగా వ్యవహరించేవాళ్లం. కానీ, ప్రభుత్వం పెద్ద ఎత్తున బలగాలతో మాపై దాడి చేయాలనుకుంది. నేను దేనికి భయపడే వ్యక్తిని కాదు. వచ్చే నెలలో జరిగే బైసాఖి పండుగ సందర్భంగా సిక్కు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు సర్‌బాత్ ఖల్సా కార్యక్రమంలో సిక్కు సంఘాలు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలి. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సిక్కు సంఘాలు పాల్గొనాలని కోరుతున్నా.  మా సహచరులపై ప్రభుత్వం జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించింది. వారిలో కొంతమందిని అస్సాం జైలుకు పంపారు. ప్రభుత్వం సిక్కు సమాజాన్ని మోసం చేసింది. దానిపై చర్చించేందుకు బైసాఖిలో జరిగే కార్యక్రమంలో సిక్కులంతా పాల్గొనాలి’’ అని పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news