తనకు ఆర్డర్ రాలేదని అమెజాన్ సీఈఓకి మెయిల్ చేసాడు…!

-

ఒక అమెజాన్ కస్టమర్ తనకు ఫోన్ ఆర్డర్ చేస్తే రాలేదు అని సీఈఓ జెఫ్ బెజోస్ కి మెయిల్ చేసాడు. అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించడంలో ముందు ఉంటారు. దీనితో తాను ఫోన్ ఆర్డర్ చేస్తే సొసైటి గేటు దగ్గర పెట్టి డెలివరీ బాయ్ వెళ్ళిపోయాడు అని మెయిల్ లో తెలిపారు. “హాయ్ జెఫ్, మీరు బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. మీ కస్టమర్ సేవ మరియు డెలివరీ ప్రోటోకాల్‌ లతో నేను చాలా నిరాశపడ్డాను.

amazon
amazon

నేను అమెజాన్ నుండి ఆర్డర్ చేసిన ఫోన్ నాకు ఇవ్వలేదు. కాని దాన్ని సొసైటి గేటు దగ్గర ఉంచారు. ఒక దొంగ దాన్ని తీసుకెళ్ళాడు. అసలు డెలివరీ గురించి నాకు ఎప్పుడు ఫోన్ చేయలేదు. మీ కస్టమర్ సర్వీస్ టీం మాత్రం దర్యాప్తు జరుగుతుందని చెప్పిందని చెప్తూ… తన సీసీటీవీ ఫూటేజ్ లింక్ కూడా పెట్టాడు. మీ వెబ్ సైట్ లో కొనాలి అంటే నేను ఆలోచిస్తా అని కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉంటే మంచిది అని చెప్పాడు. కొద్ది రోజుల్లోనే అమెజాన్ అధికారులు అతనిని సంప్రదించి అతని సమస్యను పరిష్కరించారు.

Read more RELATED
Recommended to you

Latest news