హైదరాబాద్ మహానగరంపై పగబట్టినట్టిన వరుణుడు గత వారం రోజులుగా ప్రజా జీవితాలు అతలకుతలం చేస్తున్నాడు..ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.. వర్షాలకు పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమై జన జీవనం స్తంభించింది..చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి..మరికోన్ని ప్రాంతాలు వరదతో వచ్చిన బురద నుంచి బయటపడలేదు.
ఇంకా దాని ప్రభావం నుంచి కోలుకోక ముందే తూర్పు మధ్య అరేబియా, ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. అది వాయుగుండంగా మారింది. దీంతో రాగల 48 గంటల్లో పశ్చిమ దిశగా ప్రయాణించి వాయుగుండం బలహీన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఏపీ తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తదుపరి 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని చెప్పింది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
హైదరాబాద్‌కు మరో హెచ్చరిక..దూసుకువస్తున్న వాయుగుండం..వచ‌్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు.
-