నీ అయ్య ఎవడు..చెప్పు ? అస్సాం సీఎంకు అంజన్‌ కుమార్‌ కౌంటర్‌

-

నీ అయ్య ఎవడు..చెప్పు ? అంటూ అస్సాం సీఎంకు అంజన్‌ కుమార్‌ కౌంటర్‌ ఇచ్చారు. సంస్కార హీనుడు అస్సాం సీఎంఅని.. త్యాగాల కుటుంబం పై అవాకులా.. సర్జికల్ స్ట్రైక్ జరగలేదు అని పాక్ అన్నదని గుర్తు చేశారు. దాడుల వివరాలు అడిగితే తప్పేంటి అని నిలదీశారు. మోడీ..అమిత్ షా లు దేశానికి ఇదే సంసృతి నేర్పుతున్నారని.. బీజేపీ నేతలు అంతా.. సంస్కార హీనులు అని ఆగ్రహించారు. చైనా భారత్ భుబాగంలోకి వచ్చిన సైలెంట్ గా కేంద్రం ఉందని నిప్పులు చెరిగారు.


ఎన్నికలు వచ్చినప్పుడు సానుభూతి కోసం హడావుడి చేస్తుంది బీజేపీ పార్టీ అని.. రాముడు అంతటి వాడే సీతను అగ్ని పరీక్ష పెట్టాడని నిప్పులు చెరిగారు. మేము సర్జికల్ స్ట్రైక్ వివరాలు అడిగితే ఇవ్వడానికి ఏమైంది మీకు అని నిలదీశారు. బీజేపీ వీక్ వికెట్ అని..అందుకే తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ రెచ్చ గొడుతుందని గీతా రెడ్డి ఫైర్‌ అయ్యారు. రాహుల్.. తండ్రి ఎవరని అడిగే నీ తండ్రి ఎవరని ప్రశ్నించారు.. రెచ్చ గొట్టి రాజకీయం చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ అని.. ఉద్దేశ పూర్వకంగా నే మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news