తన కారుకు పేరు పెట్టండి అంటున్న ఆనంద్‌ మహీంద్రా

మహీంద్రా వ్యాపార సామ్రాజ్య అధినేత ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే ఆనంద్‌ మహీంద్ర చాలా విషయాలను పంచుకుంటారు. అయితే.. తాజాగా.. మహీంద్రా సంస్థ తన స్కార్పియో వాహనాన్ని మరింత అభివృద్ధి చేసి, ఇటీవలే స్కార్పియో-ఎన్ వాహనాన్ని లాంచ్ చేసింది. మహీంద్రా తన కొత్త మోడల్ ద్వారా ఎస్ యూవీ సెగ్మెంట్లో మరోసారి ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. కాగా, స్కార్పియో-ఎన్ వాహనాన్ని బుక్ చేసుకున్న వారిలో మహీంద్రా వ్యాపార సామ్రాజ్య అధినేత ఆనంద్ మహీంద్రా కూడా ఉన్నారు.

Image

ఆయన ఇవాళ తన కొత్త స్కార్పియో-ఎన్ కారును అందుకున్నారు. షోరూం ఎగ్జిక్యూటివ్ ఆయనకు కారు తాళాలు అందించారు. ఈ విషయాన్ని ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇవాళ తన జీవితంలో మరపురాని రోజని తెలిపారు. కొత్త స్కార్పియో-ఎన్ వాహనాన్ని అందుకున్నానని వెల్లడించారు. అంతేకాదు, తన కొత్త కారుకు పేరు సూచించాలని నెటిజన్లను కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు రకరకాల పేర్లు సూచిస్తున్నారు.