ఈడీ దాడుల్లో టీఆర్‌ఎస్ పార్టీ, వారి కుటుంబ సభ్యులు : బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

హైదరాబాద్‌లోని ఆంధ్రప్రభ దినపత్రిక కార్యాలయంలో నిర్వహించిన ఈడీ దాడుల్లో మద్యం కుంభకోణానికి సంబంధించి లభించినఆధారాలు టీఆర్‌ఎస్ పార్టీ, వారి కుటుంబ సభ్యుల మీడియా మేనేజ్‌మెంట్‌ను బట్టబయలు చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ వి సుభాష్ ఆరోపించారు.మద్యం కుంభకోణంలో పంజాబ్‌లోని ఆప్‌ ప్రభుత్వం ఈ మీడియా హౌస్‌కి రూ. 20 కోట్లు బదిలీ చేసింది అన్న ఆరోణలున్నాయి. ఆంధ్రప్రభలో పెట్టుబడులు పెట్టిన అభిషేక్ రెడ్డి సీఎం కేసీఆర్ కుమార్తెకు అత్యంత సన్నిహితుడు అన్న విషయం వాస్తవం. టిఆర్ఎస్ అధినాయకత్వం రాష్ట్రంలో జరుగుతున్న ఈడీ దాడులు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతి, టిఆర్ఎస్ నాయకులు చేస్తున్న అక్రమాలు అవినీతి బయటపడుతున్నాయి.

BJP's win shatters TRS' 2023 hopes: NV Subhash

వివిధ దాడుల్లో దొరికిన సొమ్ములో టిఆర్ఎస్ పార్టీ ఆది నాయకులకు సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్న దృష్ట్యా టిఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవాలను బహిర్గతం చేయాలి. రాష్ట్రంలో అవినీతి ఆక్రమాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం మరియు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఈ అవినీతి సొమ్ము పై వివరణ ఇవ్వాలి. టిఆర్ఎస్ నాయకుల మరియు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ఆస్తులు విపరీతంగా పెరగడం బినామీలను ఏర్పరచుకొని ఆస్తులను కూడగట్టుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.