బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ కు సిద్ధమైన అనన్య పాండే.. ఫొటోస్ వైరల్..!

-

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ చిత్రం ద్వారా తెలుగుతెరకు పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే.. ఒకవైపు తన అందాలతో పిచ్చెక్కించడమే కాకుండా వరుసగా హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో గ్లామరస్ సెన్సేషనల్ స్టార్ గా మారిపోయింది. ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నట్లు రూమర్లు బాగా వైరల్ అవుతున్నాయి. అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో సంచలనంగా మారుతుంది అనన్య పాండే. తన కెరీర్ తొలినాళ్లల్లో ఊహించని విధంగా క్రేజ్ ను దక్కించుకున్న అనన్య పాండే ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని సంపాదించుకుంది అయితే ఇలా సోషల్ మీడియాలో కూడా బాగా పాపులారిటీని దక్కించుకోవడానికి కారణం ఈమె షేర్ చేసే హాట్ ఫోటోలే..ఈమెను అభిమానులకు మరింతగా దగ్గర చేశాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు లవ్ ఎఫైర్ రూమర్ విషయంలో కూడా బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది అనన్య.. ఇప్పటికే ఒక బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పింది. ఇషాన్ కట్టర్ తో కొన్నాళ్లపాటు డేటింగ్ చేసింది . ఇద్దరు కూడా కలిసి చట్టపట్టలేసుకొని తిరిగారు. రొమాన్స్ లో కూడా మునిగితేలారు. అయితే ఈమధ్య కాలంలో అతడికి బ్రేకప్ చెప్పింది అనన్య. ప్రస్తుతం ఇషాన్ సింగిల్ గా ఉన్నట్లు ఈమధ్య వచ్చిన కరణ్ టాక్ షో లో తెలిపిన విషయం తెలిసిందే.

ఇప్పుడు మరొక యంగ్ బాలీవుడ్ హీరో తో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది.. బాలీవుడ్ నిర్మాత మనీష్ మల్హోత్ర ఇచ్చిన దివాళి బాష్ పార్టీకి బాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది హాజరయ్యారు. అయితే ఈ నైట్ పార్టీ కోసం అనన్య పాండే బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో కలిసి రావడం అందరి అనుమానాలకు తెర లేపింది. ఆదిత్యారాయ్ , అనన్య పాండే కలిసి కెమెరాకి ఫోజులిచ్చారు. ఈ క్రమంలోని వీరిద్దరూ చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారు. ఫోటో సెషన్ అనంతరం ఇద్దరు కలిసి లోపలికి వెళ్లిపోయారు. అందుకే వీరిద్దరి మధ్య అంత చనువు ఉండడంతో డేటింగ్ రూమర్స్ రూపొందుకున్నాయి .మరి వీరి డేటింగ్ ఎంతవరకు వెళుతుందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news