తెలంగాణలో జరిగిందో తెలుసుకోకపోవడం నాకు సిగ్గుగా ఉంది : అనసూయ

-

కోలీవుడ్ నటుడు బాబీ సింహ, వేదిక ప్రధాన పాత్రల్లో యాటా సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రజాకార్. బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో అనసూయ ఒక ప్రత్యేక సాంగ్ లో కనిపించింది. ‘కశ్మీర్ కి కాపలా ఉంటూనే హైదరాబాదును కాపాడుకోవాలి’ అంటూ ఆ మధ్య వచ్చిన టీజర్, పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి అనసూయ బృందంపై చిత్రీకరించిన ‘భారతి భారతి ఉయ్యాలో’ అనే పాటను ఫస్టు సింగిల్ గా రిలీజ్ చేశారు.

ఈ సాంగ్ లాంచ్ ఈవెంటులో పాల్గొన్న అనసూయ మాట్లాడుతూ .. “నేను పుట్టి పెరిగింది తెలంగాణలోనే. ఎక్కడెక్కడో జరిగిన చరిత్రను గురించి చిన్నప్పుడు బట్టీ పట్టాను గానీ, ఇక్కడ ఏం జరిగిందనేది తెలుసుకోకపోవడం నాకు సిగ్గుగా అనిపించింది. చరిత్రను తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అనే విషయం నాకు అర్థమైంది” అని అన్నారు. “గతంలో ఎక్కడైతే నిజమైన సంఘటలు జరిగాయో .. అక్కడే ఆ దృశ్యాలను చిత్రీకరించినట్టు మేకర్స్ చెప్పారు. కాసర్ల శ్యామ్ ఈ పాటను చాలా బాగా రాశారు. షూటింగు సమయంలో ఒకటి రెండు సార్లు ఎమోషన్ కి లోనయ్యాను కూడా. ఈ సినిమాలో నేను కూడా ఒక భాగమైనందుకు గర్వంగా ఉంది” అని చెప్పారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news