గుర్తుపట్టలేనంతగా మారిపోయిన యాంకర్ శ్యామల.. ఫోటోలు వైరల్..!!

-

బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టీవీ యాంకర్ గానే కాకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా ప్రేక్షకులకు దగ్గరయింది. అప్పుడప్పుడు సినిమాలలో కూడా కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. మొదటినుండి యాంకర్ గా కంటిన్యూ అవుతున్న శ్యామల అడపాదడపా సినిమాలలో కూడా నటిస్తూ వస్తోంది. అయితే నటిగా సక్సెస్ కాలేకపోయినా.. గ్లామర్ యాంకర్ గా మాత్రం మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఒకవైపు యాంకరింగ్ చేస్తూ మరొకవైపు టీవీ షోలు, సినిమా ఫంక్షన్స్ లో సందడి చేస్తూ వస్తోంది.

ముఖ్యంగా గ్లామర్ విషయంలో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా తనదైన శైలిలో సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే ప్రతి గ్లామరస్ ఫోటో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉండగా శ్యామల ఈ మధ్యకాలంలో పెడుతున్న ఫోటోలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. గతంలో శ్యామల చాలా బొద్దుగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా సన్నబడి నాజూకుగా మారిపోయింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసరికి నెటిజన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ఇంత నాజూకుగా ఎందుకు మారింది అని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా యాంకర్ శ్యామల నాజూకుగా మారిందని ప్రూవ్ చేయడానికి ఆమె రీసెంట్గా పెట్టిన ఫోటోలు నిదర్శనం. అయితే కొన్ని వారాల క్రితం వరకు యాంకర్ శ్యామల వర్కౌట్స్ చేస్తూ ఇలా సన్నగా మారిందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా శారీ లుక్కులో పెట్టిన శ్యామల ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఎప్పటికప్పుడు తన అందాలతో అభిమానులు ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఇంస్టాగ్రామ్ లో కూడా మిలియన్ కి పైగా ఫాలోవర్స్ సొంతం చేసుకున్న శ్యామల.. న్యూ లుక్ పై నెటిజన్లు తాజాగా కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news