గోవా బీచ్ లో సేద తీరుతున్న యాంకర్ వర్షిని..

-

సెలబ్రిటీలు నిత్యం షూటింగ్స్ తో బిజీగా గడుపుతూ ఉంటారు అలాగే ఏమాత్రం సమయం దొరికిన ఈ బిజీ లైఫ్ నుంచి గ్యాప్ తీసుకోవడానికి విహారయాత్రలకు వెళుతూ ఉంటారు అయితే తాజాగా తెలుగు యాంకర్ వర్షిని కూడా ఇలా విహారయాత్రలో బిజీగా ఉంటూ తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది..

సినీ తారలు సెలబ్రిటీలు ఎప్పుడూ తన బిజీ షెడ్యూల్ ని ఫాలో అవుతూ ఉంటారు అలాగే యాంకర్ వర్షిని కూడా ప్రస్తుతం టీవీ షోలు, ప్రోగ్రామ్లతో, ఈవెంట్లతో బిజీగా గడుపుతుంది.. సందర్భమేదైనా కామెడీ పంచులు, డైలాగులతో మాటల గారడీ చేయడం ఈ ముద్దుగుమ్మ ట్యాలెంట్‌. అలాగే ఈమె టీవీ షోలు తో పాటు సినిమాలు వెబ్ సిరీస్ లో కూడా నటించి మెప్పిస్తుంది.. మోడల్ గాతన కెరీర్ ను ప్రారంభించిన ఈమె.. పెళ్లిగోల వెబ్ సిరీస్ తో మంచి పేరు సంపాదించుకుంది అలాగే రవితేజ హీరోగా వచ్చిన శంభో శివ శంభో సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది.. అలాగే లవర్స్ , కాయ్ రాజా కాయ్ , బెస్ట్ యాక్టర్స్ వంటి చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది.

ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె నిత్యం తన ఫోటోలను షేర్ చేసుకుంటూ ఉంటుంది.. అలాగే తాజాగా ఈ భామ గోవా టూర్కు వెళ్లింది.. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకోగా ప్రస్తుతం ఇవి వైరల్గా మారాయి.. ఈ ఫోటోలో వర్షిణి సముద్రపు ఒడ్డున అలలతో సరదాగా ఆడుకుంటూ చిందులేసింది. నులివెచ్చని సూర్యకిరణాల తాకుతూ ఉండగా షాడో అందాలతో ఫ్యాన్స్‌కు ట్రీట్‌ ఇచ్చింది. అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ ఫొటోలను షేర్‌ చేసుకోగా అవి కాస్తా వైరల్‌గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news