ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా సింహగిరిపై ఉన్న సింహాచల దేవస్థాన ఉప దేవాలయమైన రామాలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఇందులో భాగంగా.. ధ్వంసమైన ధ్వజస్తంభాన్ని తొలగించే పనులు చేపట్టారు అధికారులు. ఆలయ ఈవో సూర్యకళ ఆధ్వర్యంలో… ఈ పనులు జరుగుతున్నాయి.
అయితే.. ఈ తవ్వకాల్లో ధ్వజస్తంభం అడుగు భాగంలో బంగారంతో తయారు చేసిన గరుడ యంత్రం, 112 రాగి నాణేలు, రాగితో తయారు చేసిన ధ్వజస్తంభ నమూనా పత్రాలు లభ్యమయ్యాయి. రెవెన్యూ అధికారులు.. పోలీసులు, దేవస్థాన సిబ్బంది, భక్తుల సమక్షంలో పంచనామా నిర్వహించి.. లభ్యమైన వస్తువులను భద్రపరిచారు. ఈ నెల 9వ తేదీన ఆలయ ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనున్నట్లు అధికారు వెల్లడించారు.