తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని వైయస్ జగన్ కాపీ కొట్టి అమలు చేస్తానంటున్నారని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. ఒకవేళ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అందుబాటులోకి తెచ్చిన ఏపీలో ఇదివరకు ధరల రూపేనా దోచింది ఇస్తారా అని ప్రశ్నించారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో సుదర్శన హోమాలు ,చండీయాగం ముగిశాయి. అనంతరం మాట్లాడిన చంద్రబాబు మూడు నెలల్లో ఇంటికి పోయే జగన్ విశాఖకు రాజధానిని మార్చగలడట అని ఎద్దేవా చేశాడు.
. కోర్టు ఎన్ని చివాట్లు పెట్టిన తనకి సిగ్గు అనిపించడం లేదని ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూస్తే బాధగా ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలు బాగుండాలని యాగాలు చేశానని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్షంగా జరగాలని ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ నేను ఉంటానని తెలిపారు. 40 ఏళ్ల అనుభవంతో ప్రజల కష్టాలు తీరుస్తానని చెప్పారు.
ఏపీలో జగన్ సినిమా అయిపోయిందని అది జగన్ కూడా తెలుసు అని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ కి ఒక్క పరిశ్రమ తీసుకు రాలేదని విమర్శించారు.