తమ సమస్యలను పరిష్కరించాలంటు అంగన్వాడీలు చేస్తున్నా సమ్మె నేటితో 19వ రోజుకు చేరుకుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే ఈరోజు అంగన్వాడీలు మంత్రుల ఇళ్లను ముట్టడించారు. నాలుగు నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన అంగన్వాడిలు ఈరోజు మంత్రి విడదల రజిని ఇల్లును ముట్టడించారు. ప్రభుత్వం స్పందించి తమ కనీస వేతనాలు పెంచి గ్రాట్యూటీ అమలు చేసే వరకు సమ్మెను కొనసాగిస్తామని అన్నారు. అంగన్వాడీలు ఆందోళన చెందవద్దని తమ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి విడదల రజని హామీ ఇచ్చారు. త్వరలోనే ఈ సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.
స్త్రీ ,శిశు ,సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ ఇంటిని ముట్టడికి అంగన్వాడీలు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో అనంతపురం నుంచి రాయదుర్గం వెళ్తున్నటువంటి అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకొని తానాకు తరలించారు .దీంతో అంగన్వాడీలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకి దిగారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి తో పాటు విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి ముట్టడికి అంగన్వాడీలు ప్రయత్నించారు.