కరోనా కాలంలోనూ బటన్లు నొక్కడం ఆపలేదని ఏపీ సీఎం జగన్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి వద్ద నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మాట్లాడారు సీఎం జగన్. సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేసిన చరిత్ర మాది అన్నారు. రూ.2.70 లక్షల కోట్లు ప్రజలకు పంచామని తెలిపారు. రాష్ట్రంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. మేనిఫెస్టో లో పేర్కొన్న 99 శాతం హామీలు నెరవేర్చామని తెలిపారు.
చంద్రబాబుకు రోజూ నన్ను తిట్టడమే పని. చంద్రబాబు లాంటి మోసగాడు కావాలా..? జగన్ లాంటి నిజాయితీ పరుడు కావాలా..? అని ప్రజలను తేల్చుకోమన్నారు. ఇవి ఎమ్మెల్యేలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదు.. పేద ప్రజల గుండె చప్పుడే ఈ సిద్ధం సభ అన్నారు. గత 58 నెలల్లో పేద ప్రజల్లో వెలుగులు నింపాం. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలను 99 శాతం నెరవేర్చామని గుర్తు చేశారు. పొత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తూ.. దిగజారిపోయారు. మంచి పనులు చేశానని చంద్రబాబు చెప్పుకోలేడు. ఇదో రాజకీయం అవుతుందా..? చంద్రబాబు అని ప్రశ్నించారు.