వైఎస్ షర్మిలకు ఈసీ షాక్.. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై నోటీసులు

-

ఏపీ ఎన్నికల్లో రాజకీయ నేతల అనుచిత విమర్శలపై ఈసీ కొరడా ఝళిపిస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో ప్రత్యర్ధులపై ఆచితూచి విమర్శలు చేయాలని సూచిస్తోంది. అయినా పట్టించుకోని రాజకీయ నేతలపై చర్యలకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా ఇవాళ పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిలకు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఆమెపై తాజాగా వైసీపీ నేతలు మల్లాది విష్ణు, అవినాశ్ రెడ్డితో పాటు  వివేకా కేసులో అప్రూవర్ గా ఉన్న దస్తగిరి చేసిన ఫిర్యాదు మేరకు నోటీసులు పంపింది.

కడప లోక్ సభ స్ధానంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో ఉన్న వైఎస్ షర్మిల ఈ మధ్య మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యలో వైఎస్ అవినాష్ తో పాటు ఇతరుల పాత్రపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పదే పదే వివేకా కేసును ప్రస్తావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే కడప కోర్టు కూడా ఆమెకు వివేకా కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news