2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. దీంతో వైసీపీ, టీడీపీ నేతలు, పార్టీ నాయకులు కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. దీంతో పరిస్థితి మొత్తం ఆందోళనకరంగా మారిపోవడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ లు చేశారు. అలాగే పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. కాగా ఈ ఘటనలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి, తిరుపతి, రెంటచింతల, నర్సారావుపేట లో హింసాత్మక ఘటనలు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తరువాత పలు చోట్ల అల్లర్లు జరగడం పై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని పదే పదే చెప్పినా.. అలాంటి ఘటనలే చోటు చేసుకోవడంతో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డితో పాటు డీజీపీ హరీశ్ కుమార్ కి సమన్లు జారీ చేసింది. పరిస్థితిని నియత్రించలేకపోవడానికి కారణాలు ఏంటో రేపు ఢిల్లీకీ వచ్చి వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.