రాజకీయాలు పక్కనపెట్టి రైతులకు న్యాయం చేయండి.. ప్రభుత్వానికి కేటీఆర్ సూచన

-

తెలంగాణ సర్కార్ రైతులను విస్మరించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వారిని ఆదుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేయడమే టార్గెట్ గా పెట్టుకుందని విమర్శించారు. వడ్లు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళన చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. తడిసిన ధాన్యంను కొనుగోలు చేయాలి, లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతుల పక్షాన పోరాటం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంను నిలబెట్టుకుంటామ‌ని కేటీఆర్ అన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్సీస్థానాన్ని గెలిచాం. ఇప్పుడు కూడా గెలుస్తామని చెప్పారు. కాంగ్రెస్ నిరుద్యోగులను మోసం చేసింది. రేవంత్ రెడ్డి విద్యుత్ ఉద్యోగులపై ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగులను నిందించడం తగదు. ప్రభుత్వ ఉద్యోగులను సీఎం నమ్మడం లేదు. నారాయణఖేడ్ లో ఉపాధ్యాయులపై లాఠీ ఛార్జ్ చేశారు. దివాళాకోరు రాజకీయం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 7లక్షల కోట్లు అప్పు అని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసింది. రిజర్వ్ బ్యాంకు 3.5 లక్షల కోట్లు అని ప్రకటించింది. కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news