కూటమికీ ఓటేస్తే.. పథకాలన్నీ ముగింపేనని సీఎం జగన్ పేర్కొన్నారు. తాజాగా పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు సీఎం జగన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నారు. ఇంటింటికి అభివృద్ధి జరగాలంటే మళ్లీ వైసీపీకీ అధికారం రావాలి అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 99 శాతం ఎన్నికల హామీలు నెరవేర్చామని తెలిపారు.
కూటమి నేతలు ఎన్నికలు ముగిసిన తరువాత మేనిఫెస్టోను చెత్త బుట్టలో వేశారని గుర్తు చేశారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. ప్రజలు మోసపోయినట్టే అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 2లక్షల 31వేల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. ఇంటి వద్దకే రేషన్, పౌరసేవలు, పథకాలు, అవ్వ, తాతలకు పెన్షన్ వంటివి గతంలో ఎప్పుడైనా చూశారా..? అని ప్రశ్నించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగనివిధంగా పెట్టుబడి సాయంగా రైతుబీమా, ఇన్ పుట్ సబ్సీడీ, పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్, రైతన్నలకు ఆర్బీకే వ్యవస్థ వంటివి తీసుకొచ్చామని తెలిపారు.