రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించదు.. ప్రియాంకగాంధీ సంచలన వ్యాఖ్యలు

-

రుణమాఫీపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాండూరు జనజాతర సభలో ప్రియాంక గాంధీ శనివారం పాల్గొని మాట్లాడారు. తెలంగాణ అంటే తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ప్రియాంక గాంధీ అన్నారు. ఇందిరాగాంధీని తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టి చూసుకున్నారని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ తర్వాత సోనియమ్మపై ఇక్కడి ప్రజలు అభిమానం చూపించారని తెలిపారు. దేశ ప్రజలు చెప్పే సమస్యలు వినడానికి కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కాంగ్రెస్ నేతలు భావిస్తారన్నారని తెలిపారు.

రాజ్యాంగాన్ని పూర్తిగా తొలగించాలని దేశంలో ప్రయత్నం జరుగుతోందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేదలను ఆదుకునే పథకాలేమీ ఉండవన్నారు. యూపీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1200 ఉందని.. రూ.1200 గ్యాస్ సిలిండర్ను తెలంగాణలో రూ.500లకే ఇస్తున్నారన్నారు. రైతులు, నిరుపేదలు, మహిళల కోసం బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయదన్నారు. బీజేపీ పాలనలో పేదలపై వేసే పన్నులు నిరంతరం పెరుగుతూనే ఉంటాయన్నారు. పేద రైతులు రూ.50 వేలు, రూ.లక్షల రుణాలు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. పేద రైతులకు రుణమాఫీ చేసేందుకు బీజేపీ సర్కారు అంగీకరించదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news