మే 13న కురుక్షేత్ర యుద్ధం జరుగబోతుంది : సీఎం జగన్

-

ఎమ్మిగనూరు సభ ఎప్పటికీ సువర్ణాక్షరాలతో చరిత్రలో నిలిచిపోతుంది అని సీఎం జగన్ పేర్కొన్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మాట్లాడారు సీఎం జగన్.  మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతుగా చేయి చేయి కలిపినట్లుంది. జెండాలు జత కట్టిన వారిని, పేదల వ్యతిరేకులను ఓడించి.. మీ వాడిని, మీ బిడ్డని ఆశీర్వదించడం కోసం, గెలిపించడం కోసం ఇక్కడకి రావడం నా పూర్వ జన్మ సుకృతమన్నారు.

మే13న కురుక్షేత్ర యుద్దం జరుగబోతుంది. ఈ యుద్దంలో పేదలంతా ఒకవైపు.. పెత్తందారులు మరోవైపు. పొత్తులను, జిత్తులను ఎదుర్కొంటూ పేదల భవిష్యత్ కి అండగా నిలిచేందుకు నేను సిద్ధం అన్నారు. గడిచిన 58 నెలల్లో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చామని తెలిపారు. విద్యారంగంలో మార్పులను తీసుకొచ్చాం. ఈరోజు మీరు వేసే ఓటు మీ పిల్లల భవిష్యత్ మారుతుంది. మీ పిల్లల భవిష్యత్ కోసం యుద్ధం చేయడానికి నేను సిద్దం.. మీరంతా సిద్దమేనా..? అని అడుగుతున్నాను.

Read more RELATED
Recommended to you

Latest news